మీ జుట్టు క్షేమంగా ఉండాలంటే..  ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి..

జుట్టు రాలిపోయే సమస్యను దూరం చేసుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఒకసారి చూద్దాం.. 

చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం మీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంది. 

ట్రాన్స్ ఫ్యాట్స్, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్ వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. జుట్టు రాలిపోయే ప్రమాదం ఎక్కువవుతుంది. 

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీ-హైడ్రేషన్‌కు గురవుతుంది. ఫలితంగా జుట్టు రాలిపోయే సమస్య మరింత పెరుగుతుంది. 

బరువు తగ్గేందుకు పాటించే కొన్ని క్రాష్ డైట్ల వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది. 

తరచుగా మద్యపానం తీసుకోవడం కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. జుట్టు పెరగడాన్ని నిరోధిస్తుంది. 

పోషకాలు తక్కువగా ఉండే, షుగర్, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్ మీ జుట్టు సంరక్షణకు పెద్ద శత్రువు.

ఐరన్, జింక్, విటమిన్ డి, బయోటిన్, ప్రోటీన్లు తగినంత లేకపోవడం కూడా జుట్టు రాలిపోవడానికి కారణం కావచ్చు.