ఈ ఫ్రూట్స్‌తో జాగ్రత్త.. విషం తిన్నట్టే..!

స్ట్రాబెర్రీలపై పురుగుల మందులను ఎక్కువగా వాడుతున్నారు. పురుగుల మందుల అవశేషాలు ఎక్కువగా  స్ట్రాబెర్రీల మీదనే కనబడుతున్నాయట. ఇకపై వాటిని తినేముందు ఉప్పు నీటితో బాగా కడగండి.

పోషకాల పవర్ హౌస్ అని చెప్పుకునే పాలకూరలో పురుగుల మందుల అవశేషాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయట.

ద్రాక్ష పళ్లను నేరుగా తినడం చాలా ప్రమాదకరం. ఉప్పు నీటిలో పది నిమిషాలకు పైగా నానబెట్టకుండా తింటే మీరు పురుగుల మందును నోట్లో వేసుకుంటున్నట్టే.

నిగినిగలాడే పీచెస్ పళ్లపై కూడా పురుగుల మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయట. తినే ముందు బాగా కడగండి.

పియర్స్ పళ్ల సాగులో కూడా పురుగుల మందులను ఎక్కువగా వాడుతున్నారు. ఇకపై వాటిని తినేటపుడు బాగా కడగండి

ఎర్రగా మెరిసిపోయే యాపిల్స్‌పై చాలా రసాయనాలు ఉంటున్నాయట. వాటిని కడగకుండా తినడం చాలా ప్రమాదకరం.

రంగురంగుల క్యాప్సికమ్ పురుగుల మందులను ఎక్కువగా కలిగి ఉంటున్నాయట. వాటిని తరిగే ముందు బాగా కడగాలి.

చెర్రీ పళ్లను చాలా మంది నేరుగా తినేస్తుంటారు. అది చాలా ప్రమాదకరం. వాటిని కడగడానికి కొంత సమయం కేటాయించండి.