రాత్రిపూట హత్తుకుని పడుకుంటే.. ఎన్ని లాభాలో!

భార్యాభర్తలు/పార్ట్‌నర్స్ ఒకే గదిలో పడుకుంటారనే విషయం తెలిసిందే. అదే.. కౌగిలించుకొని పడుకుంటే ఎన్నో లాభాలుంటాయని నిపుణులు చెప్తున్నారు.

రాత్రిపూట పార్ట్‌నర్స్ కౌగిలించుకొని పడుకుంటే.. ఆక్సిటోసిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్‌ విడుదల అవుతుంది. దీంతో.. భార్యాభర్తలిద్దరూ ఆనందంగా ఉంటారు.

పార్టనర్‌ని కౌగిలించుకోవడం వల్ల.. రాత్రంతా హాయిగా నిద్రపోతారు. దీంతో ఒత్తిడి, గందరగోళం తగ్గుతుంది. మరుసటి రోజు రీఫ్రెషింగ్‌గా ఉంటారు.

పార్ట్‌నర్స్ కలిసి నిద్రిస్తే.. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలై, అది శరీరంలోని ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తుంది. మంటని తగ్గించి, ఇమ్యూనిటీని పెంచుతుంది.

కౌగిలించుకోవడం అనేది ప్రేమను వ్యక్తపరిచే ఓ బాడీ లాంగ్వేజ్. పార్ట్‌నర్స్ హగ్ చేసుకుంటే.. ఇద్దరి మధ్య బంధం బలపడుతుందని నిపుణులు చెప్తున్నారు.

హగ్గింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. కౌలిగించుకోవడం వల్ల హృదయ స్పందన రేటు, రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుందని తేలింది.

ఎవరైనా.. ఒత్తిడిలో లేదా ఆందోళనగా ఉన్నప్పుడు హగ్ చేసుకుంటే.. అది వారికి ఓదార్పుని ఇస్తుంది. ఫలితంగా.. వారిలో ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది.