అల్పాహారంగా పోహా తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!

పోహా, బియ్యం అటుకులతో తయారు చేసే ఈ వంటకం భారతీయ అల్పాహారాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 

పోహాలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. దీనిని తిన్న తర్వాత కడుపు నిండుగా ఉంటుంది. 

పోహాలో అనేక పోషకాలున్నాయి. కేలరీలు తక్కువగా ఉండే పోహా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. 

పోహాను ఉదయం పూట తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.

ఐరన్ మెండుగా ఉన్న పోహాలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, రక్తహీనతను తగ్గించే గుణం కూడా ఉంది. 

ఇందులో బి1, బి2, బి3, బి6 వంటి విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలున్నాయి. 

కొవ్వు తక్కువగా ఉండే పోహాను ఎంత తిన్నా, తేలిగ్గా జీర్ణం అవుతుంది.