ఉదయం వేళ ఒంటికి సూర్యకిరణాలు సోకితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

ఈ సూర్యరశ్మితో శరీరంలో జీవ గడియారం రీసెట్ అవుతుంది. ఫలితంగా రాత్రిళ్లు మంచి నిద్ర పడుతుంది

ఈ కిరణాలతో ఒంట్లో కొవ్వు దాచే కణాలు కుంచించుకుపోతాయి. ఆరోగ్యం ఇనుమడిస్తుంది

మెదడులో సెరటోనిన్ స్థాయిలు పెరిగి మానిక ప్రశాంతత, ఉల్లాసం కలుగుతాయి

ఈ సూర్యరశ్మితో మెదడు సామర్థ్యం పెరిగి నిర్ణయాత్మక శక్తి కూడా ఇనుమడిస్తుంది.

ఈ కిరణాలు కంటి చూపునకు కూడా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు 

శరీరంలో విటమిన్ డీ ఉత్పత్తి పెరిగి ఎముకలు, రోగనిరోధక శక్తి బలోపేతం అవుతాయి

ఈ ఉపయోగాలు ఒనగూడేందుకు ఉదయం లేవగానే కనీసం 15 నిమిషాలు ఎండలో ఉండాలి