గోరింటాకు వల్ల ఇన్నీ లాభాలున్నాయా.. 

కాళ్లు, చేతులు అధికంగా నీటిలో నానడం వల్ల పుండ్లు పడుతుంటాయి. గోరంటాకు పెట్టుకోవడం వల్ల పుండ్లు తగ్గుతాయి.

నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే.. తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడడం తగ్గుతుంది. 

ఆయుర్వేదంలో గోరింటాకును నోటి పూతకు, చర్మ, కాలేయ రోగాలకు ఔషధంగా వాడుతారు. 

కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న వారు గోరింటాకు నూనెపై పూతగా వాడితే.. మంచి గుణం కనబడుతుంది. 

గోరింటాకును వేళ్లకు పెట్టుకోవడం వల్ల గోళ్లు పుచ్చిపోకుండా ఉంటాయి. 

గోరింటాకు పొడిని నూనెలో కలిపి వడకట్టి ఆ నూనె తలకు రాసుకోవడం వల్ల తెల్ల జుట్టు నల్లబడుతుంది. 

ఒక టీ స్పూన్ గోరింటాకు పొడిని నిమ్మరసంతో కలిపి ప్రతీ రోజు తీసుకుంటే రక్తం శుభ్రపడి చర్మంలో మెరుగు వస్తుంది. 

గోరింటాకుతో ఆరోగ్యంతోపాటు అందం కూడా సొంతం అవుతుంది.