విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు రాత్రిళ్లు చదివితే కలిగే 9 ప్రయోజనాలు ఏవంటే..

రాత్రిళ్లు చదువుకు ఆటంకాలు తక్కువగా ఉంటాయి. దీంతో చదువుపై పూర్తిగా దృష్టి పెట్టొచ్చు

రాత్రి నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి ఏకాగ్రత త్వరగా కుదురుతుంది. చదివింది ఎక్కువకాలం గుర్తుంటుంది.

రాత్రిళ్లు చదివితే సృజనాత్మకత, సమస్యలు పరిష్కరించే సామర్థ్యం పెరిగినట్టు ఉంటుందని కొందరు చెబుతారు

రోజంతా జాబ్ లేదా ఇతర వ్యాపకాలతో గడిపేవారికి రాత్రి చదువులే అనువైనవి

కష్టమైన పాఠ్యాంశాలు చదివేందుకు రాత్రే అనువైన సమయమని కొందరు అంటారు.

రాత్రిళ్లు చదివిన విషయాలు బాగా గుర్తుంటాయని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు రుజువు చేశాయి

గతంలో చదువుకున్న పాఠాలు పునశ్చరణ చేసుకునేందుకు కూడా రాత్రే తగిన సమయం

రాత్రి చదువులతో ఒక సంతృప్తి, బాగా చదివామన్న భావన కలిగి ఉత్సాహం ఇనుమడిస్తుందని కూడా చెబుతున్నారు.