ముడతలు తగ్గాలంటే,  ఈ ఫేస్‌ప్యాక్స్ మీ కోసమే!

ఒత్తిడి, బిజీ లైఫ్‌స్టైల్, నిద్రలేమి వంటి కారణాల వల్ల.. కొందరికి ముఖంపై ముడతలు వస్తుంటాయి. అలాంటి వారి కోసమే ఈ ఫేస్‌ప్యాక్స్.

నిమ్మరసాన్ని కొద్దిగా రోజ్‌వాటర్‌లో కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.

అరటిపండుని గుజ్జులా చేసి చర్మంపై రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత వేడినీటితో శుభ్రం చేయాలి. ఇది చర్మకణజాలల్ని హైడ్రేట్ చేస్తుంది.

ఇంట్లోనే కొబ్బరిపాలు తయారు చేసి.. ముఖానికి రుద్దుకొని.. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

పండిన బొప్పాయిని పేస్టులా సిద్ధం చేసి.. ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

జామ పండు, జామ ఆకులు, ఓట్‌మీల్ మిక్స్ చేసి పేస్టులో చేయాలి. దీన్ని ముఖానికి రాసుకొని.. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కొద్దిగా తేనె, పాలు కలుపుకొని.. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. 30 నిమిషాలు తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి.