సమ్మర్ స్పెషల్ రెసిపీ..
మామిడికాయ హల్వా
మామిడికాయల పొట్టు తీసేసి, మిక్సీలో వేసి పేస్టులా తయారుచేసుకోవాలి.
సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి.
స్టవ్‌పై పాన్ పెట్టి నెయ్యి వేసి పేస్టులా పట్టుకున్న మామిడికాయ గుజ్జు వేసి వేయించాలి.
తరువాత కొబ్బరిపాలు పోయాలి. సగ్గు బియ్యం వేసి ఉడికించాలి.
ఇప్పుడు పంచదార వేసి కలుపుకోవాలి. యాలకుల పొడి, జాజికాయ పొడి, ఫుడ్ కలర్, కాస్త ఉప్పు వేయాలి.
మిశ్రమం చిక్కగా అవుతున్న సమయంలో కొద్దిగా నెయ్యి వేయాలి.
ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి పెట్టుకోవాలి. మిశ్రమం ఉడికిన తరువాత ప్లేట్‌లోకి పోసుకోవాలి.
జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకోవాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేయాలి.
Related Web Stories
కోడిగుడ్డు పచ్చడి.. ఇలా చేస్తే టేస్ట్ వేరెలెవల్
తల లేకపోయినా బతికుండే జంతువులు ఇవే
స్నానం చేసిన వెంటనే నీరు తాగితే.. ఏమవుతుందో తెలుసా..
కొత్త మట్టి కుండను వాడే ముందు..