బైకర్లు ఈ తప్పులు చేయకుండా.. ప్రమాదాలకు దూరంగా ఉండండి

అనేక మంది రోడ్డుపై బైక్ నడుపుతున్నప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి

ఈ క్రమంలో బైకర్లు డ్రైవింగ్ చేసే క్రమంలో ఆ తప్పులు చేయకుండా ఉంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు

అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలనేది ఇప్పుడు చుద్దాం

బైక్‌ను ప్రాంతాన్ని బట్టి పరిమిత వేగంతో నడపాలి. గల్లీల్లో కూడా వేగంతో డ్రైవ్ చేయకూడదు

బైక్ నడిపే ముందు ఎప్పుడూ తాగకూడదు. ఇలా చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ

ట్రాఫిక్ నిబంధనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉల్లంఘిస్తే మీకు ఫైన్‌తోపాటు ప్రమాదం జరిగే అవకాశం ఉంది

చాలా మంది సమయాన్ని ఆదా చేయడానికి వ్యతిరేక దిశలో డ్రైవ్ చేస్తారు. కానీ అలా చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ

బైక్ నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ రోడ్డువైపే చూడాలి. మరోచోట గానీ, స్పీడో మీటర్ గానీ చూస్తే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది

మలుపుల ప్రాంతాల్లో బైక్ వేగాన్ని తగ్గించి, సౌండ్ చేస్తూ ముందుకు వెళ్లాలి. లేదంటే ఎదురుగా వచ్చే బైక్ బ్యాలెన్స్ కోల్పోయి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది

బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఇయర్‌బడ్‌లు ధరించి డ్రైవ్ చేయోద్దు

బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి. దీని ద్వారా ప్రమాదం జరిగినా తలకు గాయాలు కాకుండా కాపాడుకోవచ్చు