బాటిల్ వాటర్ ఇంత ప్రమాదకరమా..?

 బయట షాపుల్లో కొనుక్కోని వాటర్ బాటిల్ లోని నీళ్లు తాగినా ప్రమాదకరమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

 బాటిల్ వాటర్‌లోని మైక్రో ప్లాస్టిక్ శరీరానికి హాని కలిగిస్తుందని తెలిసింది

 మైక్రోప్లాస్టిక్ మెదడుకు కూడా హాని చేస్తుందని అధ్యయనాలు తెలిపాయి..

 సగటున ఒక లీటర్ వాటర్ బాటిల్ లో మన కంటికి కనిపించని రెండున్నర లక్షల ప్లాస్టిక్ సూక్ష్మకణాలు ఉన్నట్లు గుర్తించారు.

 ఈ ప్లాస్టిక్ మన కణాల్లోకి చేరినప్పుడు ఏం జరుగుతుందో ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని పరిశోధకులు తెలిపారు

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (బాటిల్ వాటర్)ని హై రిస్క్ ఫుడ్ కేటగిరీలో చేర్చింది. ఈ మేరకు FSSAI కొత్త నిబంధనలను జారీ చేసింది.