జిమ్ లేకుండానే ఇలా కండలు పెంచుకోండి..

కండలు పెంచుకుని ఫిట్‍నెస్ మెరుగుపర్చుకోవాలని అనేక మంది భావిస్తారు

ప్రతిరోజు వర్క్ అవుట్స్ చేయడంతో ఆరోగ్యంతోపాటు ఫిట్‌గా ఉంటారు

కానీ అందరికీ జిమ్‌కి వెళ్లి వర్క్ అవుట్స్ చేసేందుకు సమయం ఉండదు

అలాంటి వారు ఇంటి దగ్గరే వర్క్ అవుట్స్ చేసి కండలు పెంచుకోవచ్చు

ప్రతిరోజు 10 నుంచి 20 పుష్‍అప్స్ చేస్తే కండరాలు పెరుగుతాయి

కాళ్లు ముందుకు చాపి నడుము వంచి కూర్చున్నట్టుగా రోజు 20 స్క్వాట్స్ చేయాలి

కుర్చీ ఉందన్నట్టుగా అనుకుని కాళ్లపై భారం వేసి పైకి లేస్తూ చేయాలి

ప్లాంక్ పొజిషిన్ విధానంలో బ్రీత్ కంట్రోల్ చేసుకుంటూ ప్రతి రోజు పాటించాలి

గుంజీల మాదిరిగా మొకాళ్లపై కూర్చుని నిలబడి 20 సార్లు చేయాలి

కాలి వేళ్లపై నిలబడి శరీరం మొత్తాన్ని పైకి బ్యాలెన్స్ చేస్తూ నిలబడి ముందుకెళ్లాలి