డయాబెటిస్, కొలస్ట్రాల్ మధ్య సంబంధమేంటి.. ఈ నిజాలు తెలిస్తే.. 

షుగర్ వ్యాధి శరీరంలోని హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్ సమతూకాన్ని దెబ్బతీస్తుంది. హెచ్‌డీఎల్ కొలస్ట్రాల్‌ను తగ్గించి, ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్‌ను పెంచుతుంది. 

శరీరంలో ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్ పెరగడం గుండెపోటు, పక్షవాతం మొదలైన వాటికి కారణం అవుతుంది. 

మెటబాలిక్ సిండ్రోమ్ కారణంగానే షుగర్ వ్యాధి, అధిక కొలస్ట్రాల్ సమస్యలు వస్తాయి. ఈ రెండు కలిసి కార్డియో వాస్క్యులర్ సమస్యను పెంచుతాయి. 

నిజానికి అధిక కొలస్ట్రాల్ సమస్య, చక్కెర వ్యాధి ఒకదానినొకటి ప్రభావితం చేస్తాయి. ఈ రెండింటలో ఏ సమస్య ఉన్నా మరో సమస్య మొదలవుతుంది. 

డయాబెటిక్ పేషెంట్లు వాడే కొన్ని మందులు కూడా శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను పెంచే ప్రమాదం ఉంది. 

ఈ రెండు సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఊబకాయం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచుతుంది. అలాగే అధిక కొలస్ట్రాల్‌కు కారణం అవుతుంది.

షుగర్ వ్యాధి, అధిక కొలస్ట్రాల్.. ఈ రెండు కలిసి గుండెపై తీవ్రంగా దాడి చేస్తాయి. ఈ రెండు ఉన్న వారు తరచుగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. 

ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టాలంటే లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవాలి. అధిక షుగర్, అనారోగ్యకర కొవ్వులు ఉండే జంక్ ఫుడ్‌కు దూరమవ్వాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.