వయాగ్రా వల్ల ఈ ఉపయోగాలు కూడా ఉన్నాయని తెలుసా? 

అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న పురుషులకు వయాగ్రా అనేది దివ్యౌషధంగా పరిచయమే. అయితే వయాగ్రా కొన్ని ఇతర సమస్యల చికిత్సలో కూడా ఉపయోగపడుతుందట. 

పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని నియంత్రించే PDE5 అనే ఎంజైమ్‌ను వయాగ్రా నిరోధిస్తుంది. ఫలితంగా పురుషాంగానికి రక్త ప్రవాహం పెరిగి అంగస్తంభనను సులభతరం చేస్తుంది. 

ఫాస్ఫోడీస్టేరేస్ టైప్ 5 ఇన్హిబటర్ అని పిలిచే వయాగ్రా గుండెకు కూడా రక్తసరఫరా పెరగడంలో సహాయపడుతుందట. అందుకే గుండె వ్యాధులు చికిత్సలో కూడా వయాగ్రాను ఉపయోగిస్తారు

పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వారి చికిత్సలో వయాగ్రాను కూడా ఔషధంగా వినియోగిస్తున్నారు. 

తాజా పరిశోధనలు డిమెన్షియా (చిత్త వైకల్యం)ను నియంత్రించడంలో కూడా వయాగ్రా సమర్థంగా పని చేస్తుందని తేల్చాయి. 

మెదడుకు మెరుగ్గా రక్తప్రసరణ జరిగేలా చూడడం వల్ల బ్రెయిన్ ఆరోగ్యాన్ని కాపాడుతుందట. జ్ఞాపకశక్తి క్షీణించకుండా నిరోధించగలదట. 

న్యూరో డీజెనరేటివ్ వ్యాధులకు ఇన్‌ఫ్లమేషన్ కారణమని నమ్ముతారు. ఆ ఇన్‌ఫ్లమేషన్‌ను ఎదుర్కోవడంలో వయాగ్రా కీలకంగా పని చేస్తుందట. 

వయాగ్రాలో న్యూరో ప్రొటక్టివ్ లక్షణాలు ఉన్నాయని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. ఇవి మెదడు కణాలకు రక్షక కవచంలా నిలిచి డిమెన్షియాను నిరోధిస్తాయట.