బరువు తగ్గించే మందులు అంధత్వాన్ని కలిగిస్తాయా..

బరువు తగ్గించే మందులతో ఊబకాయం ఉన్న వారిలో కంటి సమస్యలు తలెత్తుతున్నాయనేది ఓ అధ్యయనంలో తేలింది.

నాన్ ఆర్టెరిటిక్ యాంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి NAION ఉన్నట్లు నిర్థారణ అయింది. ఇది ఒక కంటిలో ఆకస్మిక దృష్టిని కోల్పోయే సమస్య.

మధుమేహం లేదా ఊబకాయం ఉన్న రోగులు, సాధారణంగా బరువు తగ్గించే మందులైన ozempic nsoe wegovy వంటి మందులును కంటి చూపును తగ్గిస్తాయి.

బరువు తగ్గించే మందులలో ప్రోటీన్ సెమాగ్లుటైడ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. 

NAION అనేది అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ ప్రకారం లక్ష జనాభాకు ఇద్దరు నుంచి పదిమంది మాత్రమే ప్రభావితం అయ్యే అరుదైన కంటి సమస్య ఇది.

అరుదైన కంటి సమస్య తలకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఏర్పడుతుంది. ఇది శాశ్వతంగా కంటి చూపును కోల్పోయేందుకు దారితీస్తుంది.

ఈ అధ్యయనంలో 17000కంటే ఎక్కువ మందిలో జరిగిన పరిశోధనలో వారు ఊబకాయం, మధుమేహంతో బాధపడుతున్నట్టుగా తేలింది.

బరువు తగ్గేందుకు మందులు తీసుకోవాల్సి వస్తే NAION ప్రమాదాన్ని గురించి డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి.