ప్రతిరోజు ఐదు నిమిషాల పాటు ``ఓం`` మంత్రాన్ని జపించడం ద్వారా ఎన్నో ఆరోగ్య, మానసిక ప్రయోజనాలు కలుగుతున్నాయని సైన్స్ కూడా ధ్రువీకరిస్తోంది.
ప్రశాంతంగా కూర్చుని ``ఓం`` మంత్రాన్ని జపించడం ద్వారా శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయులు తగ్గుతున్నాయట. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట.
మనస్సును పూర్తిగా లగ్నం చేసి మంత్రాన్ని పఠించడం అలవాటు చేసుకుంటే కాగ్నిటివ్ ఫంక్షన్ మెరుగుపడుతోందట. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతోందట.
``ఓం`` మంత్రాన్ని జపిస్తూ దీర్ఘ శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతోందట.
``ఓం`` మంత్రాన్ని జపించడం అలవాటు చేసుకున్న వారిలో మైండ్‌ఫుల్ నెస్ పెరిగి ఆలోచనల మీద నియంత్రణ సాధించగలుగుతున్నారట.
క్రమం తప్పకుండా మంత్రాన్ని బయటకు చెప్పడం ద్వారా కొందరిలో బీపీ కూడా తగ్గుతున్నట్టు కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
``ఓం`` మంత్రాన్ని జపించిన వారి మైండ్ ప్రశాంతంగా మారి చక్కగా నిద్రపోగలుగుతున్నారట.
``ఓం`` పఠిస్తున్న వారిలో భక్తి భావాలు పెరగడమే కాదు.. పాజిటివ్ ఫీలింగ్స్ కూడా పెరుగుతున్నాయట.