గ్యాస్ తగ్గించడానికి ఈ ఐదు రకాల మూలికలు వాడి చూడండి..!

మూలికలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయనేది మనందరికీ తెలుసు. జీర్ణక్రియలో అసౌకర్యం ఉన్నప్పుడు ఈ మూలికలను తీసుకుంటే సరిపోతుంది.. 

 గ్యాస్ సమస్య అందరిలో కాకపోయినా కొందరిలో ఇబ్బందికరమైన సమస్యే.. దీనికి చెక్ పెట్టాలంటే మూలికలను తీసుకుంటే సరి. 

పుదీనా జీర్ణ వ్యవస్థను సడలించడంలో సహాయపడుతుంది. గ్యాస్, ఉబ్బరం తగ్గిస్తుంది.

అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ సమస్యను తగ్గించడంలో ప్రసిద్ధి చెందింది.

సోపు గింజలు ఇవి కూడా కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణ వ్యవస్థను కండరాలును సడలించే సమ్మేళనాలున్నాయి.

చమోమిలేలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి.. ఇవి గ్యాస్ ని తగ్గించి, జీర్ణవ్యవస్థను ఉపశమనం కలిగిస్తాయి.

షాజీరా గింజలు కూడా ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

ఈ పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి.