వంట నూనె నిల్వ చేసే బాటిళ్లను క్లీన్ చేయడం అంత ఈజీ కాదు. వాటి జిడ్డు అంత త్వరగా తొలగిపోదు. జిడ్డు పూర్తిగా తొలగాలంటే ఈ టిప్స్ అనుసరించండి.
ఆయిల్ బాటిల్‌ని వేడి నీటిలో ఉంచాలి. ఇది బాటిల్ నుంచి మొత్తం నూనెను తొలగిస్తుంది. నీటి నుండి సీసాలను తీసివేసి, టిష్యూ పేపర్ లేదా టవల్‌తో తుడవవచ్చు.
డిష్ సోప్‌తో శుభ్రం చేయవచ్చు. ముందుగా లిక్విడ్ సోప్, స్క్రబ్బర్ తో బాగా స్క్రబ్ చేయాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.
వెనిగర్‌తోనూ బాటిల్‌లను శుభ్రం చేయవచ్చు. ఒక గిన్నె లో నీరు తీసుకుని, అందులో వెనిగర్, నిమ్మరసం కలపాలి. అందులో నూనె సీసాలు, బాటిల్స్ వేయాలి. అనంతరం సబ్బుతో కడిగేస్తే సరి.
బేకింగ్ సోడాతో బాటిల్‌ను సులువుగా శుభ్రం చేయవచ్చు. బేకింగ్ సోడా జిడ్డును తొలగిస్తుంది. వేడి నీటిలో బేకింగ్ సోడా కలుపుకోవాలి. అందులో బాటిల్‌లను ముంచి కాసేపు నాననివ్వాలి. అనంతరం క్లీన్ చేస్తే సరి.