చన్నీళ్లు vs వేడి నీళ్లు.. రెండింటిలో ఏవి మంచివి?

మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. తాగిన చన్నీళ్లు శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారడానికి కొన్ని క్యాలరీలు అవసరం. ఫలితంగా మెటబాలిజమ్‌ వేగవంతం అవుతుంది. 

చన్నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల దంత, గమ్ సమస్యలు మొదలవుతాయి. పలు ఇన్ఫెక్లన్లు మొదలవుతాయి. 

వేడినీళ్లు తాగడం వల్ల జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది. డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. సైనస్ వంటి సమస్యలు దూరమవుతాయి.

వేడినీళ్లు ఎక్కువగా తాగితే డీహైడ్రేషన్ మొదలవుతుంది. వేడి నీళ్ల వల్ల కూడా దంత, గమ్ సమస్యలు మొదలవుతాయి.

చన్నీళ్లతో స్నానం చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. పలు నొప్పులు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతాయి. 

వేడి నీళ్ల స్నానం వల్ల హృదయ సామర్థ్యం పెరుగుతుంది. జాయింట్ పెయిన్స్, తగ్గుతాయి. మంచి నిద్ర పడుతుంది. 

వేడి నీళ్లతో ఎక్కువగా స్నానం చేస్తే చర్మంపై ఉండే అవసరమైన ఆయిల్స్ దూరమై డ్రై స్కిన్ సమస్య మొదలవుతుంది. 

వేడి నీళ్లు, చల్లటి నీళ్లు వేటికవే భిన్నమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా నీటిని ఎంచుకోవాలి.