రెస్టారెంట్ లాంటి బిర్యానీ  ఇంట్లోనే చేయాలంటే..!

సరైన బిర్యాని రైస్ ఉపయోగించి బిర్యానీ తయారుచేస్తే రుచి బావుంటుంది. దీనికి బియ్యాన్ని 30 నిమిషాలు నానబెట్టాలి.

బిర్యానీ తయారీలో లేయరింగ్ కీలకం.. ఉడికించిన అన్నం, కుంకుమ పువ్వు, పాలు, వేయించిన ఉల్లిపాయలు, మసాలాలతో, ఉడికించిన మాంసంతో పొరలుగా ఉండేలా చూడాలి.

సుగంధ ద్రవ్యాలు, తాజా కూరలు, మాంసం బిర్యానీ రుచిని పెంచుతాయి.

రుచి సరిగ్గా ఉండేందుకు మాంసం, పెరుగు, మసాలాల మిశ్రమాన్ని కొన్ని గంటలపాటు మెరినేట్ చేయాలి.

దమ్ బిర్యానికి కుండను వాడటం మంచిది. లోపల పదార్థాలతో నింపి కుండ అంచును పిండితో మూసివేయాలి.

చిన్న మంటపైన ఉంచి కొద్దిసేపు ఉడికించాలి. కుంకుమ పువ్వు పాలను కలిపి బిర్యానీ పొరల మీద వేయాలి.

 వేయించిన ఉల్లిపాయలు కూడా బిర్యానీకి మంచి రుచిని తెస్తాయి.

బిర్యానీ తయారైన తర్వాత 10 - 15 నిమిషాల తర్వాత తింటూ రుచిని అస్వాదించడమే..