db0e861d-2405-4628-82a7-a18ad02d435d-6.jpg

కరకరలాడే క్యాబేజి పకోడి..  ఇలా చేస్తే ఇంట్లోనే క్యాటరింగ్ టేస్ట్

f8539abb-ce64-453e-8d48-dfc7b8c47738-00.jpg

కావలసిన పదార్థాలు: క్యాబేజి: పావు కిలో ముక్క, శెనగపిండి: కప్పు, బియ్యం పిండి: పావు కప్పు, 

89135819-1f62-4769-8b78-6daab09f477c-5.jpg

అల్లం, మిర్చిపేస్టు: స్పూను, ఉప్పు, పసుపు: తగినంత, పచ్చి మిర్చి: మూడు, 

81e67b74-db40-45aa-93a3-c72110ffb051-8.jpg

కరివేపాకు: రెండు రెబ్బలు, కొత్తిమీర: కొంచెం, జీలకర్ర: అర స్పూను, నూనె: తగినంత.

ముందుగా క్యాబేజిని సన్నని ముక్కలుగా తరగాలి.

ఓ బేసిన్‌లో ఈ ముక్కలు తీసుకుని ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర తరిగి బాగా కలపాలి. 

దీంట్లో బియ్యపు పిండి, శెనగ పిండి వేసి తగినంత నీరు పోసి కలపాలి. 

జారుగా లేదా గట్టిగా కలుపుకున్నా పర్వాలేదు.

 బాండీలో నూనె పోసి కాగిన తరవాత చిన్న చిన్న ముద్దలుగా వేసి బాగా వేయించి తీస్తే క్యాబేజిపకోడి రెడీ.