8d00683d-3395-4d23-92ec-e8d6c2064f1c-curly-hair_11zon.jpg

ఆఫ్రికా దేశస్థుల్లో ప్రతి ఒక్కరికీ రింగుల జుట్టు ఎందుకు ఉంటుందో తెలుసా..

7264af8b-a179-4cb0-b10c-523a1da8f484-normal-hair_11zon.jpg

పొడవాటి, ఒత్తైన మెరిసే జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ  కోరుకుంటారు. దీని కోసం ప్రజలు అనేక రకాల చిట్కాలు ప్రయత్నిస్తారు.

1d1b8259-d0b3-412b-ad79-0a9106b7d4f0-african_11zon.jpg

ఇండియాలో కొందరికి స్ట్రెయిట్ హెయిర్ ఉంటే మరికొందరికి కర్లీ హెయిర్ ఉంటుంది. కానీ, ఆఫ్రికా ఖండంలో ఉండే ప్రతి ఒక్కరికీ రింగుల జుట్టే ఉంటుంది.

345ec4ab-0bed-471a-a030-2df5c0492e0e-children_11zon.jpg

గిరజాల జుట్టును ఆఫ్రో హెయిర్ అని కూడా పిలుస్తారని మీకు తెలుసా. ఆఫ్రికాలో నివసించే చాలా మందికి గిరజాల జుట్టు ఎందుకు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 

భూమధ్యరేఖకు సమీపంలో ఉండటం వల్ల ఆఫ్రికా వాతావరణం వేడిగా ఉంటుంది. ఇక్కడ సూర్యకిరణాలు నేరుగా, బలంగా భూమిని తాకుతాయి. దీని కారణంగా ఉష్ణోగ్రత పెరిగి వేడిగా ఉంటుంది.

ఉత్తర, దక్షిణాఫ్రికాలో కొన్ని ఎడారి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు సగటు కంటే అధికం. వర్షపాతం అత్యల్పంగా ఉంటుంది. ఆ వేడి, తేమ వాతావరణానికి తట్టుకునేలా ఇక్కడి ప్రజల జుట్టు ఉంటుంది.

జుట్టు పెరుగుదలలో జన్యువులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జుట్టు ఆకృతిని నిర్ణయించడంలో నిర్దిష్ట జన్యువులు కీలక పాత్ర వహిస్తాయి.

ఆఫ్రికన్ సంతతికి చెందిన వారిలో గిరజాలు లేదా ఆఫ్రో-టెక్చర్డ్ జుట్టు సాధారణం. అలాగే యూకే, ఆసియా, యూఎస్ ప్రాంతాల్లోనూ గిరిజాల జుట్టు ఉన్నవాళ్లు కనిపిస్తారు.