టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో  కీలక నిర్ణయాలు తీసుకున్నారు

సమావేశం వివరాలను టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీడియాకు వెల్లడించారు

శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని నిర్ణయించారు

శ్రీనివాస సేతుపై వంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు

సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా టీటీడీ నిర్ణయించింది

తిరుమల డంపింగ్‌ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తామని

ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తాం ఆయన చెప్పారు

పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నాం

తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తాం అని బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు