దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పలుచోట్ల ప్రజలు టపాసులు పేల్చారు

దీంతో శబ్దకాలుష్యంతో పాటు గాలి నాణ్యత విపరీతంగా పడిపోయింది

ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించలేనంత పరిస్థితి నెలకొంది

ఢిల్లీ లో గాలి నాణ్యత 362 పాయింట్లుగా నమోదైంది

ఆనంద్‌విహార్‌లో గాలి నాణ్యత సూచీ 385 పాయింట్లకు చేరుకుంది

ఆర్కేపురం, అశోక్‌ విహార్, మందిర్‌ మార్గ్, ఎయిర్‌పోర్టు, రోహిణీ, జహంగీర్‌పుర్‌తో పాటు 

నొయిడా, గాజియాబాద్, గురుగ్రామ్‌లోనూ సూచీ 350పైనే ఉండటం గమనార్హం

పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని కొన్ని ప్రదేశాల్లో సైతం గాలి నాణ్యత క్షీణించింది