షుగర్ వ్యాధిగ్రస్తులు.. చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

షుగర్ వ్యాధిగ్రస్తులు చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చలి కాలంలో పలు కారణాల వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. 

చలి కాలంలో సూర్యకాంతి తగ్గుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలనిపిస్తుంది. శారీరక శ్రమ తగినంత చేయడం కుదరదు. 

చలికాలంలో మెటబాలిజమ్ కూడా కాస్త నెమ్మదిస్తుంది. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. 

చలికాలంలో ఉదయాన్నే యోగా చేయడం మంచిది. యోగా వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి. 

చలికాలంలో దొరికే పాలకూర, ఫెనుగ్రీక్, బ్రకోలీ వంటివి తీసుకోవడం ద్వారా తగిన మోతాదులో ఫైబర్, అవసరమైన పోషకాలు లభిస్తాయి. 

చలికాలంలో మెటబాలిజమ్ మెరుగ్గా ఉండాలంటే వేడి నీళ్లు తాగాలి. రక్తంలో చక్కెర స్థాయులు కూడా రెగ్యులేట్ అవుతాయి. 

ఎండ కాసే సమయంలో వీలైనంత సమయం బయట ఉండాలి. శరీరంలో తగినంత విటమిన్-డి ఉంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. 

రెగ్యులర్‌గా రక్తంలో చక్కెర స్థాయులను చెక్ చేసుకోవాలి. వైద్యులు సూచించిన విధంగా మందులు వేసుకోవాలి.