ముఖానికి వీటిని పొరపాటున కూడా నేరుగా అప్లై చేయవద్దు..
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇవి చర్మానికి మంచివి.. అయితే నేరుగా వీటిని ముఖానికి అప్లై చేయవద్దు.
చాలా మంది స్క్రబ్ కోసం షుగర్‌ని వాడతారు. అయితే నేరుగా షుగర్ అప్లై చేయడం వలన స్కిన్ రాషేస్ వచ్చే అవకాశం ఉంది.
చాలామంది చర్మ సంరక్షణ కోసం బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. అయితే చర్మం pH స్థాయిని పాడుచేయవచ్చు
తాజా కలబంద జెల్‌ను నేరుగా చర్మంపై పూయడం వల్ల చికాకు, దద్దుర్లు ఏర్పడతాయి,
ముఖ్యంగా సున్నితమైన స్కిన్ ఉండే వారు నేరుగా కలబందను ఉపయోగించవద్దు. దీనిని రోజ్ వాటర్, విటమిన్ ఇ క్యాప్సూల్, బాదం లేదా కొబ్బరి నూనెను కలిపి వాడాల్సి ఉంటుంది.
ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.