6f30655f-337b-4347-98cd-e4e0b24fb81f-morning.jpg

పరగడుపునే ఈ 8 పనులు చేస్తే ఆరోగ్యం, ఆనందం మీ వెంటే..!

41df01b2-dbd4-4a78-975b-246217a9575e-morning8.jpg

ఉదయం లేచిన వెంటనే గ్లాసుడు వేడి నీళ్లు తాగండి. మీ మెటబాలిజమ్ ప్రారంభమవడమే కాకుండా వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. రాత్రి నిద్ర తర్వాత శరీరం చక్కగా హైడ్రేట్ అవుతుంది. 

d3a9e61e-5205-445a-992b-05b528632460-morning2_11zon.jpg

గాలి బలంగా తీసుకుని వదిలే వ్యాయామం చేయండి. అలా చేయడం వల్ల మీ బ్రెయిన్‌కు ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. మీకు ఏకాగ్రత పెరుగుతుంది.

869c2a22-56a7-414e-bf91-600bca1955cc-morning3.jpg

కొద్ది క్షణాలు ధాన్యం చేయండి. ఒత్తిడి దరి చేరకుండా ఆశావహ దృక్పథంతో రోజును మొదలు పెట్టండి. మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

యోగా, స్ట్రెచింగ్, వాకింగ్ వంటి తేలిక పాటి వ్యాయామాలు చేయండి. అలా చేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ జరుగుతుంది.

ఉదయాన్నే చన్నీటి స్నానం చాలా మంచిది. చర్మంతో సహా అన్ని భాగాలకు రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది.

బయటకు వచ్చి తాజా గాలిని పీల్చండి. ఉదయాన్నే వీచే గాలి మీ మనస్సును స్వచ్ఛంగా మారుస్తుంది.

శరీరానికి కాసేపు ఉదయపు ఎండను తగలనివ్వండి. మీకు అవసరమైన డీ విటమిన్ అందుతుంది. 

ఆ రోజు ఏం చేయాలనే విషయాల గురించి కాసేపు ఏకాగ్రతతో ఆలోచించండి. చక్కటి ప్లానింగ్‌తో రోజును ప్రారంభించండి.