కార్తీక పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే దైవ కృప ఖాయం..

హిందూ మాసంలో కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది.  

కార్తీక మాసంలో కొన్ని పనులు చేస్తే దైవ కృప లభించడం ఖాయమని పండితులు అంటున్నారు.

కార్తీక మాసంలో గంగాస్నానం చేస్తే జన్మలో చేసుకున్న పాపాలు నశిస్తాయట.

గంగానదిలో స్నానం చేయలేకపోతే ఇతర నదులలో స్నానం చెయ్యాలి. కుదరకపోతే గంగాజలాన్ని నీళ్లలో కలిపి ఇంట్లోనే చెయ్యాలి.

కార్తీక పూర్ణిమ రోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే  మంచిది.

కార్తీక మాసంలో ఇంట్లో,  గుడులలో, నదీ తీరాలలో  దీపాలు వెలిగించాలి.

దీపాలు వెలిగించడమే కాదు దీప దానం చేసినా బోలెడు పుణ్యం . దీని వల్ల జీవితంలో కమ్ముకున్న చీకట్లు తొలగిపోతాయి.

కార్తీక మాసంలో విష్ణువు ఆరాధన చాలా ముఖ్యమైనది.  కార్తీక స్నానం చేసి "ఓం నమో భగవతే వాసుదేవాయ"  లేదా "ఓం విష్ణువే నమః" అనే మంత్ర జపం చేయాలి

విష్ణుమూర్తి ఫొటో లేదా విగ్రహం ముందు తలసి ఆకులను ఉంచితే విష్ణువు సంతోషిస్తాడు.

పేదలకు, బ్రాహ్మణులకు బట్టలు, ధాన్యం,  నీరు,  ఇతర అవసరమైన వస్తువులు దానం చేస్తే ఎంతో పుణ్యం.

ఆవులకు, పక్షులకు మేత వేయడం, ధాన్యం తినిపించడం చేస్తే మంచిది.