థైరాయిడ్ సమస్యలు కంట్రోల్ కావాలంటే ఇలా చేయండి..!

సరైన జీవన శైలి లేకపోవడం వల్ల థైరాయిడ్ సమస్య ఉంటుంది. కొన్ని ముఖ్యమైన హార్మోన్లు శరీరంలో చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉత్పత్తి అవుతాయి. 

హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంధి, థైరాయిడ్ హార్మోన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోయేతే ఏర్పడే పరిస్థితి. 

శరీరంలో ఊబకాయం వేగంగా పెరుగుతుంది. ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా థైరాయిడ్‌ను నియంత్రించవచ్చు.

కొవ్వు పదార్ధాలు, వేయించిన ఆహారాలు, మితిమీరిన తీపి పదార్థాలు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం పూర్తిగా మానేయాలి.

థైరాయిడ్‌లో, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఫైబర్ అధికంగా ఉండే వాటిని తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.

శరీరంలో అయోడిన్ లోపించడం వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి.

థైరాయిడ్ రోగి శరీరంలో విటమిన్ డి లోపం కూడా కనిపిస్తుంది. ఇందుకోసం రోజులో కాసేపు ఎండలో కూర్చోవాలి.

థైరాయిడ్ మందులు వేసుకున్న తర్వాత కాల్షియం, ఐరన్ మందులు తీసుకోకూడదు.

థైరాయిడ్ రోగి రోజుకు 40-45 నిమిషాల పాటు కొంత ఫిట్‌నెస్ వ్యాయామం చేయాలి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది.