ఉడికించేటప్పుడు గుడ్లు పగిలిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..

 చాలా మంది గుడ్లతో పాటు సహా నీళ్లు వేసి ఒకటేసారి ఉడికిస్తారు

అలా కాకుండా నీళ్లు ముందుగానే మరిగించి ఆ తర్వాత గుడ్లను వేయండి. ఇలా చేయడం వల్ల గుడ్లు త్వరగా పగలవు.

 వేడి నీళ్లలో కొద్దిగా వెనిగర్ కలిపి ఉడికించినా గుడ్లు పగలవు. పగుళ్లు వచ్చినా కూడా గుడ్లు బాగా ఉడుకుతాయి.

ముందుగానే నీటిలో వెనిగర్ కలిపి ఉడికించండి. దీని వల్ల పచ్చ సొన బయటకు లీక్ అయ్యే అవకాశం ఉండదు.

కొద్దిగా నూనె వేయండి. దీని వల్ల గుడ్లు పగిలిపోకుండా ఉంటాయి.