ఇంటి బాల్కానీలోకి పావురాలు రావడం వల్ల ఇబ్బంది పడుతున్నవారు.. అవి రాకుండా ఉండేందుకు ఈ పనులు చేయండి..

ముందుగా మీ ఇంటి బాల్కానీలో ఎలాంటి ఆహార పదార్థాలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.

వీలైతే బాల్కానీలోకి ఏవీ చొరబడకుండా జాలరీని ఏర్పాటు చేసుకోవాలి.

పాత సీడీలు, లేదా అల్యూనిమినియం వంటి మెరిసే వస్తువులను బాల్కానీలో వేలాడదీయాలి.

బాల్కనీలో నీరు, వెనిగర్ మిశ్రమాన్ని స్ప్రే చేయాలి. ఈ వాసనకు పావురాలు రాకుండా ఉంటాయి.

పక్షులకు హాని కలిగించకుండా శబ్ధాలను విడుదల చేసే అల్ట్రాసోనిక్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. 

పావురాలు వాలే ప్రాంతంలో నాన్-టాక్సిక్ బర్డ్ రిపెల్లెంట్ జెల్‌ను పూయాలి.