రాత్రి భోజనం తర్వాత శరీరం విశ్రాంతి దశలో ఉంటుంది. ఆ సమయంలో స్వీట్ తింటే బరువు నియంత్రణలో ఉండదు. స్వీట్‌లోని కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అధిక బరువుకు కారణమవుతాయి.
డిన్నర్ తర్వాత స్వీట్ తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఫలితంగా రాత్రి సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
రాత్రి సమయంలో కొవ్వు, చక్కెర అధికంగా ఉండే స్వీట్లు తింటే జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం మొదలైన సమస్యలు వస్తాయి.
డిన్నర్ తర్వాత స్వీట్‌లు మీ దంతాలను పాడు చేస్తాయి. దంత క్షయం లేదా కావిటీలకు కారణమవుతాయి.
పడుకునే ముందు స్వీట్‌లు తినడం వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. మీ స్లీప్ సైకిల్ దెబ్బతింటుంది.
రాత్రి స్వీట్లు తిని వెంటనే పడుకునే అలవాటు తీవ్ర అనర్థాలకు కారణమవుతుంది. ఊబకాయం, టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులకు దారి తీస్తుంది.
రోజూ స్వీట్లు తినడం వల్ల అధిక క్యాలరీల ఆహారం వైపు మనసు ఆకర్షితమవుతుంది. పోషక, సమతుల ఆహారానికి దూరమై శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది.
రాత్రి డిజర్ట్‌లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి మూడ్ స్వింగ్స్‌కు కారణమవుతాయి. నీరసం, అలసట, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు.