ట్యాంక్ బండ్ పై ఉన్న ఆన్నమయ్య విగ్రహాం గురించి తెలుసా?
హైదరాబాద్‌లో ట్యాంక్
బండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.
చాలా మంది నగరవాసులు సాయంత్రం వేళల్లో, వీకెండ్స్‌లో ట్యాంక్ బండ్ దగ్గరు వెళ్లి రిలాక్స్ అవుతారు.
ఇక్కడ హుస్సేన్ సాగర్ లేక్ మాత్రమే కాకుండా.. ఆ చుట్టు పక్కల పరిసరాల్లో అనేక మంది ప్రముఖుల విగ్రహాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
ట్యాంక్‌బండ్‌పై ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుని విగ్రహం కనిపిస్తుంది.
అన్నమయ్య పద్యం పాడుతున్నట్టుగా ఈ విగ్రహం సందర్శకులను కనువిందు చేస్తుంది.
పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్న అన్నమయ్య పరమ వైష్ణవ భక్తుడు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు.
అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో సామాన్యులు సైతం పాడుకునేలా వాడుక భాషలో ఉంటాయి.
తిరుమలతో పాటు అనేక దేవాలయాల్లో అన్నమయ్య రాసిన పాటలు వినిపిస్తూనే ఉంటాయి.
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు
అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి. జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి.
తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా అనేక రకాలైన శైలిలో పాటలు రాశాడు అన్నమయ్య.
Related Web Stories
ట్యాంక్ బండ్ పై విగ్రహాలు ఎవరో తెలుసా?
రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
మెదడుకు ఇలా ట్రెయినింగ్ ఇస్తే.. సక్సెస్ పక్కా!
భారతదేశంలో లభించే అత్యంత ఖరీదైన ఆహారాలు ఇవే..