రోజూ వేయించిన శనగలు తినడం వల్ల ఏంజరుగుతుందో తెలుసా..!

సాయంత్రాలు ఏదైనా స్నాక్స్ రూపంలో తీసుకోవడాన్ని అంతా ఇష్టపడతారు. కాలక్షేపానికి స్నాక్స్ రూపంలో పల్లీలు, వేయించిన శనగలు మంచి కాంబినేషన్..

వేయించిన శనగలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది ఎముక పుష్టికి, కణాల పెరుగుదలకు మంచిది.

శనగల్లో విటమిన్లు, కాల్షియం, ఇనుము, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు కలిగి ఉంటాయి.

శనగలలో అధిక పోషకాలు, ఫైబర్ కంటెంట్, G1కారణంగా డయాబెటిక్ చిరుతిండి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 

సమతుల్య ఆహారంలో భాగంగా రోజూ 100 గ్రాముల వరకు వేయించిన శనగలను తీసుకోవచ్చు. 

పోషకాహారం విభాగంలో ప్రొఫైల్ కారణంగా శనగలు ఆరోగ్యకరమైన చిరుతిండి.. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. 

సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా తినగలిగే స్నాక్స్ లలో వేయించిన శనగలు బెస్ట్..

వేయించిన శనగలలో మాంగనీస్, ఫోలేట్, ఫాస్పరస్, రాగి ఉన్నాయి. ఇవి మన హృదయ ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తాయి.