అధిక బరువు vs ఊబకాయం: రెండింటి మధ్య తేడాలు తెలుసా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వారిలో 89 కోట్ల మంది ఊబకాయంతో సతమతమవుతున్నారు. ఈ రెండింటి మధ్య తేడా తెలుసా?
బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 25 నుంచి 30 మధ్యలో ఉంటే అధిక బరువును కలిగి ఉన్నట్టే. 30 లేదా అంత కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఊబకాయంతో బాధపడుతున్నట్టు లెక్క.
ఊబకాయులు కొద్ది దూరం నడిచే సరికే అలసి పోతుంటారు. నిద్రపోతున్నప్పుడు గురక వస్తుంది. చెమట ఎక్కువగా పడుతుంది. అలాగే రోజువారీ పనులు చేయడానికి కష్టపడుతుంటారు.
అధిక బరువు కలిగిన వ్యక్తుల్లో కొవ్వు శాతం మరీ అంత ఎక్కువగా ఉండదు. వీరు ఆ దశలో జాగ్రత్త పడకపోతే ఊబకాయానికి చేరువ అవుతారు.
అధిక బరువు కలిగిన వారు ఆరోగ్యకర అలవాట్లతో సాధారణ స్థితికి చేరుకోవచ్చు. ఊబకాయులలో మాత్రం కొవ్వు శాతం అధికంగా ఉండడం వల్ల చికిత్స కూడా తీసుకోవాల్సి ఉంటుంది
అధిక బరువు, ఊబకాయం.. రెండూ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అయితే ఊబకాయులను అధిక కొలస్ట్రాల్, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వెంటాడతాయి.
ఊబకాయులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. బరువు మరీ ఎక్కువైపోతే సర్జరీ కూడా చేయించు కోవాల్సి ఉంటుంది.
అధిక బరువు కలిగిన వారు రోజూ తగినంత వ్యాయామం, సమతుల ఆహారం, తగినంత నిద్ర కలిగి ఉంటే ఆరోగ్యంగా ఉంటారు.