వంటింట్లో ఉండే ఈ పప్పు నాన్ వెజ్ కంటే బలాన్నిస్తుంది తెలుసా..

వంటింట్లో చాలా రకాల పప్పు ధాన్యాలు ఉంటాయి. వాటిలో మినపప్పు ఒకటి.  

మినపప్పులో ఫైబర్,  ఫోలెట్,  సోడియం,  పొటాషియం, కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం,  కార్బోహైడ్రేట్స్,  ప్రోటీన్, ఫాస్పరస్, జింక్ వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

మినపప్పును క్రమం తప్పకుండా వాడుతుంటే శరీరానికి అమితమైన బలం, పోషణ లభిస్తుంది.

మినపప్పులో ఫైబర్ సమృద్దిగా ఉంటుంది.  ఇది జీర్ణ వ్యవస్థకు చాలా సహాయపడుతుంది.

మినపప్పు బరువు తగ్గడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో  సహాయపడుతుంది.

కడుపు వాపులు, ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇందులో ఎక్కువ మొత్తంలో  డైటరీ పైబర్ ఉంటుంది. ఇది మలబద్దకం,  రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో సహాయపడుతుంది.

పైల్స్, శ్వాస సమస్యలు,  నిద్ర లేమి వంటి సమస్యలను నయం చేస్తుంది.