సోయా మిల్క్.. ఏడు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
సోయా పాలు పూర్తిగా మొక్కల నుంచి లభించే ప్రోటీన్. శరీరానికి అవసరమైన మొత్తం 9 ముఖ్యమైన అమినో యాసిడ్స్ ఈ పాలలో ఉంటాయి.
సోయా పాలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పాలలో కాల్షియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి.
సోయా పాలలో కొలస్ట్రాల్ అసలు ఉండదు. అలాగే శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సోయా పాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మోనోపాజ్ సమయంలో చాలా మంది మహిళలు బోలు ఎముక వ్యాధికి గురవుతారు. సోయా పాలు తాగడం వల్ల ఆ సమస్య రాకుండా ఉంటుంది.
సోయా పాలలో కొవ్వులు తక్కువ. ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి సోయా పాలు మంచి ఆహారం.
జుట్టు పెరుగుదలకు సోయా పాలు చాలా ఉపయోగపడతాయి. జుట్టు పెరుగుదులకు అవసరమయ్యే ప్రోటీన్లను సోయా పాలు కలిగి ఉంటాయి.
సోయా పాలలోని కొన్ని సమ్మేళనాలు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
కాల్షియం శాతం ఎక్కువగా ఉండే సోయా పాలను క్రమం తప్పకుండా తాగితే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Related Web Stories
ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ముఖం శాశ్వతంగా మెరుస్తూ ఉంటుంది..!
వారణాసిలో తప్పక సందర్శించాల్సిన 9 ప్రదేశాలు
ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగొద్దు..ఎందుకంటే
మీకు షుగర్ ఉందా? బెల్లం గురించి ఈ విషయాలు తెలుసుకోండి..!