జిలేబి అంటే ఇష్టమా..  ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

ముందుగా ఒక బౌల్‌లోకి మైదా పిండిని తీసుకోని దానికి శనగపిండి, పెరుగు కలిపి ఉండలు రాకుండా పేస్ట్‌గా కలుపుకోవాలి.

కలిపిన పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టి స్టౌవ్‌ మీద పాన్‌ పెట్టి పంచదార వేయాలి.

 పంచదారలో నీరు పోసి పాకం వచ్చేంత వరకు కలుపుతూ వేడి చెయ్యాలి.

తర్వాత మరో స్టౌవ్‌పై బాండీ పెట్టి అందులో నూనె, నెయ్యిని వేసుకోవాలి

ముందుగా తయారు చేసుకున్న పిండిని కోన్‌లాంటి ప్లాస్టిక్‌ కవర్‌లో నింపి జిలేబి ఆకారం వచ్చేలా నూనెలో వేసుకోవాలి

రెండు వైపుల గోల్డ్‌ కలర్‌  వచ్చే వరకు వేగించాలి. 

తర్వాత ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలో జిలేబిలను కొద్ది సేపు ఉంచితే సరి వేడి వేడిగా రుచికరమైన జిలేబిలు రేడీ.