మీ పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే.. ఈ నియమాలు పాటించండి..!
భోజనం చేసే సమయంలో చిన్న ప్లేట్‌ను ఎంచుకోండి. ఫలితంగా మీరు తక్కువ తినడానికి అలవాటు పడతారు.
ఉదయం లేదా సాయంత్రం మొలకలను స్నాక్స్‌గా తీసుకోండి. దీనిలోని ప్రోటీన్లు మీ పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగిస్తాయి.
తరచుగా మంచి నీటిని తాగుతూ ఉండండి. పొట్ట నిండుగా ఉన్న భావన ఏర్పడి ఆహారం వైపు మనసు మళ్లకుండా ఉంటుంది.
ఇంట్లో వండిన ఆహారం తినడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. నెలకు రెండు సార్లకు మించి బయట భోజనం చేయకండి.
హెచ్‌డీఎల్ కొలస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలైన చేపలు, డ్రైఫ్రూట్స్ వంటి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇది పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం మీ కండరాలను దృఢంగా మార్చడమే కాకుండా మీ మెటబాలిజమ్‌ను పెంచుతుంది.
మీ భోజనంలో కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు తగినంత ఉండేలా జాగ్రత్తపడండి. అప్పుడే మీకు అన్ని పోషకాలు అంది ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు.
కూల్ డ్రింక్‌లు, వేపుడు పదార్థాలు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాల జోలికి వెళ్లకండి. వీటిలోని ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్ మీ పొట్ట చుట్టూ పేరుకుపోతుంది.