ఈ మండే ఎండలో హెల్మెట్ ధరించి బైక్ నడపడం కష్టమైన పని.

ఎండ వేడిలో హెల్మెట్ ధరించడం వల్ల తలకు చెమట పట్టి, అసౌకర్యంగా అనిపిస్తుంది.

మీ తలకు పలుచని గుడ్డ కట్టుకుని దానిపై హెల్మెట్ ధరించడం మంచిది.

మీ జుట్టును కప్పి ఉంచే టోపీ లేదా పలుచని గుడ్డను తలకు చుట్టుకుని హెల్మెట్ ధరించండి.అది చెమటను గ్రహిస్తుంది.

వేసవిలో వీలైనంత వరకు బిగుతుగా ఉండే హెల్మెట్ ధరించడం మానుకోవాలి.ఇది గాలి ప్రవాహాన్ని తగ్గిస్తుంది.మురికి,చెమటను నిలుపుకోవడంలో సహాయపడుతుంది.

హెల్మెట్‌ను తరచుగా శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. దుమ్ము, ధూళి ఎప్పటికప్పుడు తొలగిస్తే జుట్టుపై దాని ప్రభావం కనిపించదు. 

హెల్మెట్‌ను శుభ్రం చేసిన తర్వాత హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టవద్దు.ఇలా చేయడం వల్ల తలలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం పెరుగుతుంది.

హెల్మెట్‌ను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. ఫలితంగా అందులో దుమ్ము పేరుకుపోతుంది.