76aecce8-aaf7-4720-8401-71ea7d1d73c7-blood8.jpg

        రక్తదానం చేస్తే  ఎన్ని ఉపయోగాలో తెలుసా?

6121ff94-fd65-4594-a054-bebc59dcc8a3-blood.jpg

రక్తదానం వల్ల ఇతరులకు మేలు చేస్తున్నాం అనుకుంటాం. నిజానికి మీ ఆరోగ్యానికి కూడా మేలు చేసుకున్నట్టే. రక్తదానం చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

1beccf63-2255-48c2-89f3-ff075044987e-blood5.jpg

రక్తదానం చేయడం వల్ల అదనపు ఐరన్ స్థాయులు తగ్గుతాయి. ఫలితంగా రక్తనాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది.

d70482f8-f4a7-4588-8a34-7c3543733d54-blood3.jpg

పురుషులు క్రమం తప్పకుండా రక్తదానం చేయడం మంచిదని ఓ అధ్యయనంలో తేలింది. మహిళలు పీరియడ్స్ రూపంలో ప్రతి నెల కొంత రక్తాన్ని కోల్పోతారనే సంగతి తెలిసిందే.

d65bcd54-6c4b-4449-bf21-a66cf389fa14-blood2.jpg

రక్తదానం చేసిన తర్వాత శరీరం కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కొన్ని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అలాగే రక్తకణాల ఉత్పాదకత మెరుగుపడుతుంది.

dfa15dd9-0eb9-4a02-a871-987597a50fc8-blood6.jpg

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులు ఎక్కువగా ఉన్నట్టైతే రక్తదానం చేయడం మంచిది. రక్తదానం చేయడం వల్ల రక్తం యొక్క స్నిగ్ధత తగ్గుతుంది. ఫలితంగా రక్తం గడ్డ కట్టడం, స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

381fab43-dcc3-4f85-8918-744498262589-blood7.jpg

రక్తంలో ఐరన్ పేరుకుపోవడం వల్ల వచ్చే వ్యాధి హెమోక్రోమోటోసిస్. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా రక్తదానం చేయాలి.

0c49d234-a13f-4693-b169-7b11cd529da5-blood9.jpg

రక్తదానం చేయడం వల్ల ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు. రక్తం తీసుకునే ముందు హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులు, ఇతర అంటువ్యాధులు ఉన్నాయో లేదో పరీక్షిస్తారు.

f2aa565e-75a5-482a-8aab-43a2a3f12c88-blood4.jpg

ఒక రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. ఇతరులకు సహాయం చేయడం మంచిదని భావించే పాజిటివ్ మనస్తత్వం మీ జీవితానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.