గాడిద పదం వాడుకలో నిందాపూర్వకంగా మారింది కానీ గాడిదల టాలెంట్ సామాన్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అప్పచెప్పిన పనులు పద్ధతిగా చేయడంలో ఇవి సిద్ధహస్తులట

మనిషి సగటు బరువుకంటే అధికంగా ఉన్న వాటిని కూడా గాడిదలు ఈజీగా మోయగలవు

గాడిదకు బద్ధకం ఎక్కువని అంటారు కానీ అందులో కూడా నిజం లేదని జంతుశాస్త్రవేత్తలు చెబుతున్నారు

గాడిదలు కొత్త ప్రదేశాలకు ఏ మార్గంలో వెళ్లిందీ బాగా గుర్తుపెట్టుకుంటాయట. మళ్లీ అదే మార్గంలో తిరిగి రాగలవట

తెలివైనవిగా పేరుపడ్డ డాల్ఫిన్లు, కుక్కల కంటే గాడిదల తెలివితేటలు ఎక్కువని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు

దీని మెమరీ పవర్ కూడా ఎక్కువే

మైళ్ల దూరంలో ఉన్న సహచరుల చేసే శబ్దాలను బట్టి అవి ఏవే ఇట్టే గుర్తించగలవు