హిందూ మతం ప్రకారం.. వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి, దేవతకు అంకితం చేయడం జరిగింది. బుధవారం నాడు విజ్ఞాలు తొలగించే విజ్ఞేశ్వరుడిని పూజిస్తారు ప్రజలు.
జాతకంలో బుధుని స్థానం బలహీనంగా ఉంటే జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. బుధుని స్థానాన్ని బలోపేతం చేయడానికి కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.
జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే.. బుధవారం పొరపాటున కూడా కొనకూడని వస్తువులు చాలా ఉన్నాయి. అవి కొంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
బుధవారం నాడు కొత్త బట్టలు, కొత్త బూట్లు, చెప్పులు కొనకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
బుధవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఈ రోజున రుణం ఇవ్వడం వల్ల డబ్బు కొరత ఏర్పడవచ్చు. రుణం తిరిగి పొందడం కష్టంగా మారొచ్చు.
బుధవారం జుట్టుకు సంబంధించిన దువ్వెన, నూనె, హెయిర్ డ్రయ్యర్, బ్రష్ లేదా సబ్బు మొదలైన వాటిని కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధుడు మరింత బలహీనుడు అవుతాడు.
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే.. బుధవారం పాలతో చేసిన ఉత్పత్తులను కొనకూడదు. ఇంట్లోనూ తయారు చేయకూడదు.
నోట్: ఈ స్టోరీలో పేర్కొన్న వివరాలన్నీ ఆధ్యాత్మిక పండితులు తెలిపిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.