రాత్రి చేసే ఈ తప్పుల వల్ల.. ఉదయానికి షుగర్ పెరిగిపోతుంది!

రాత్రి నిద్రకు ముందు చేసే కొన్ని పొరపాట్ల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చాలా ఎక్కువగా నమోదవుతుంది. 

రాత్రి 8 గంటల తర్వాత తినడం అనేది చాలా పెద్ద తప్పు. అందువల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువగా నమోదవుతుంది. 

రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం కూడా బ్లడ్ షుగర్ పెరుగుదలకు కారణమవుతుంది. తిన్న రెండు గంటల తర్వాతే నిద్రపోవాలి. 

రాత్రి తినే భోజనంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే రాత్రంతా రక్తంలో చక్కెర స్థాయులు స్థిరంగా ఉంటాయి. 

రాత్రి వేళ ఆలస్యంగా హై-గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తినడం షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరం. 

మీరు తీవ్ర ఒత్తిడిలో ఉన్నా, రాత్రి వేళ సరిగ్గా నిద్రపోక పోయినా తర్వాతి రోజు ఉదయానికి మీ రక్తంలో చక్కెర ఎక్కువైపోతుంది. 

రాత్రి నిద్రకు ముందు, అర్ధరాత్రి సమయంలో వీలైనన్ని మంచినీళ్లు తాగండి. షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పక చేయాల్సిన పని ఇది. 

రాత్రి ఏడు గంటలకు భోజనం చేయండి. తర్వాత కాసేపు నెమ్మదిగా నడవండి. చిన్న చిన్న పనులు చేయండి. అలా చేయడం వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.