వాకింగ్‌కు వెళ్తున్నారా? ఈ తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి..
ఆరోగ్యం కోసం చాలా మంది వాకింగ్ చేస్తుంటారు. అయితే ఆ సమయమంలో చేసే కొన్ని తప్పులు మొదటికే మోసం తీసుకొస్తాయి. మీరు కూడా ఆ తప్పులు చేస్తున్నారేమో సరి చూసుకోండి..
వాకింగ్ చేసే సమయంలో తలను నేరుగా తిన్నగా పెట్టాలి. చాలా మంది కిందకు చూసి, వంగినట్టు నడుస్తుంటారు. అలా చేయడం వల్ల మెడనొప్పి, నడుం నొప్పి మొదలవుతాయి.
వాకింగ్‌కు ముందు కాస్త వార్మప్ వ్యాయామాలు చేయడం మంచిది. లేకపోతే మోకాళ్లు, ఇతర కీళ్ల నొప్పులు మొదలవుతాయి.
వారం మొత్తం నడవడం కూడా కండరాళ్లకు, కీళ్లకు మంచిది కాదు. వారంలో రెండు రోజులు విశ్రాంతి తీసుకోవడం మంచిది.
వాకింగ్ చేసే సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే చాలా నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంది.
అనారోగ్యంగా అనిపించిపుడు కచ్చితంగా వారం రోజులు నడకకు విరామం ఇవ్వాల్సిందే. ముఖ్యంగా జ్వరం వచ్చినపుడు శరీరం విశ్రాంతి కోరుకుంటుంది.
అలసటగా అనిపించినపుడు వెంటనే నడక ఆపెయ్యాలి. సామర్థ్యానికి మంచి వ్యాయామం చేస్తే గుండె మీద, కండరాల మీద ఒత్తిడి పడుతుంది.
నడుస్తున్నప్పుడు చేతులను, భుజాలను ఫ్రీగా వదిలెయ్యాలి. చేతులు ముందుకు, వెనక్కి కదులుతున్నప్పుడే శరీరం బ్యాలెన్స్ అవుతుంది.