కాఫీ, టీ మానండి..  ఇలా చేసి ఉత్సాహంగా మారండి..!

మనసు బాగోలేనపుడు, మగతగా ఉన్నప్పుడు చాలా మంది కాఫీ, టీలు తాగుతుంటారు. అయితే కెఫిన్‌కు ప్రత్యామ్నాయంగా కొన్ని ఆరోగ్యకర అలవాట్లు చేసుకోవడం ఉత్తమం.

చ్యూయింగ్ గమ్ నమలడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఉత్తేజంగా మారవచ్చు. అలాగే పనిలో ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతాయి.

సూర్యకాంతి మీ సర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించడంలో సహాయపడే సహజ ఉద్దీపన. ఉదయం సమయంలో కాసేపు ఆరు బయట గడపండి.

మీ మొహాన్ని చల్లటి నీటితో కడుక్కోండి. మీ శరీరాన్ని షాక్‌కు గురి చేయడానికి లేదా మేల్కొలపడానికి చన్నీటి స్నానం చేయండి.

మీ శరీరం, మనసును ఉత్తేజంగా మార్చడానికి బ్రీతింగ్ వ్యాయామాలు, యోగా చేయండి.

మానసిక స్థితి, శక్తిని ప్రేరేపించే సామర్థ్యం సంగీతానికి ఉంది. మీ మనసు బాగోలేనపుడు, మగతగా అనిపించినపుడు మంచి పాటలు వినండి.

బచ్చలి కూర, కాలే, అరటిపండు, యాపిల్ జ్యూస్‌ను కలిపి గ్రీన్ స్మూతీని తయారు చేసుకుని తాగండి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్లతో నిండిన గ్రీన్ స్మూతీ మీకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది.

సహజ ఎలక్ట్రోలైట్స్, హైడ్రేటింగ్ లక్షణాలు కలిగిన కొబ్బరి నీళ్లు కెఫిన్ పానియాలకు సరైన ప్రత్యామ్నాయం. మీ మనస్సును ఉత్తేజ పరిచే శక్తి కొబ్బరి నీళ్లకు ఉంది.

మనసు బాగోలేనపుడు, మధ్యాహ్న భోజనం తర్వాత 10 నుంచి 20 నిమిషాల పాటు చిన్న కునుకు తీయడం మంచిది. పవర్ నాప్ మీ మనసుకు కొత్త శక్తిని ఇస్తుంది.