పెరుగు ఇష్టమా?..
ఈ ఆహారాలతో మాత్రం కలిపి తినకండి..
రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగే అలవాటు ఉన్న వారు ఆ సమయంలో పెరుగును తీసుకోకూడదు.
వేడి పదార్థాలు తిన్న వెంటనే పెరుగన్నం తినకూడదు. అలాగే వేడి అన్నంలో పెరుగు వేసుకుని కూడా తినకూడదు. అలా చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదు.
పెరుగన్నంలో ఉల్లిపాయ తినడం చాలా మందికి ఇష్టం. అయితే తరచుగా అలా తింటే చర్మ సంబంధ సమస్యలు మొదలవుతాయి.
పరోటా, చపాతీతో పాటు చాలా మంది పెరుగు కూడా తీసుకుంటుంటారు. అలా చేయడం వల్ల ఎసిడిటీ సమస్య మొదలవుతుంది.
చాలా మందికి పెరుగన్నంలో అరటిపండు కలిపి తినడం అలవాటు. ఈ రెండింటి కాంబినేషన్ శరీరంలో టాక్సిన్స్‌ను పెంచుతుంది.
పెరుగు మాత్రమే కాదు.. పాల ఉత్పత్తులు వేటి తోనూ గుడ్డు తీసుకోకూడదు. ఆహారం జీర్ణం కాకపోగా, గ్యాస్ సమస్యలు మొదలవుతాయి.
పెరుగు చలవ పదార్థం. మామిడి వేడి చేసే గుణం ఉన్న ఫలం. రెండు పుల్లటి పదార్థాలూ కలిపి తినడం వల్ల గ్యాస్ సంబంధ సమస్యలు మొదలవుతాయి.
వేడి చేసే పదార్థం అయిన బెల్లంతో పాటు పెరుగు కలిపి తింటే జ్వరం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
చికెన్, మటన్, చేపలు మొదలైనవి తిన్న వెంటనే పెరుగు తీసుకోకూడదు. కడుపు ఉబ్బరం, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం మొదలైన సమస్యలు చుట్టుముడతాయి.
Related Web Stories
చర్మానికి తేనె ఉపయోగపడుతుందిలా
మద్యం సేవించేటప్పుడు అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే!
ఒంటిపై గాయాలు త్వరగా మానట్లేదా? మీకీ లోపం ఉన్నట్టే!
ఈ ఫుడ్స్ చేపలకంటే చాలా బెటర్! ఎందుకో తెలిస్తే..