బొప్పాయితో పాటు వీటిని అస్సలు తినకండి..
బొప్పాయితో పాటు కొన్ని ఆహార పదార్థాలను తినడం పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.
బొప్పాయి తిన్న వెంటనే పాలు, పెరుగు, ఛీజ్ వంటి డెయిరీ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
బొప్పాయితో పాటు గుడ్లు తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు సమస్య ఎదురవుతుంది. కడుపు బరువుగా ఉంటుంది.
బొప్పాయి, కీరా దోసకాయలను వెంట వెంటనే తీసుకోకూడదు. ఈ రెండూ ఒకేసారి తినడం వల్ల శరీరం ఉష్ణోగ్రత పడిపోయే ప్రమాదం ఉంది.
బొప్పాయి తిన్న వెంటనే స్పైసీ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. ఈ రెండు జీర్ణ వ్యవస్థపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి.
బొప్పాయి తిన్న చాలా సేపటి వరకు పచ్చళ్లు తీసుకోకూడదు. ఎసిడీటీ మొదలై చాలా అసౌకర్యంగా ఉంటుంది.
నూనెలో బాగా వేయించిన పదార్థాలను బొప్పాయితో పాటు తీసుకుంటే విరేచనాలు మొదలవుతాయి.
బొప్పాయి తిన్న వెంటనే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ ఫలాలను తినకూడదు. రెండింటి ఎంజైమ్‌ల చర్యల వల్ల కడుపులో అసౌకర్యం మొదలవుతుంది.
బొప్పాయితో పాటు చేపలు తినకూడదు. ఈ రెండింటినీ ఒకేసారి తినడం పలు అలెర్జీలకు కారణమవుతుంది.
Related Web Stories
ఐస్‌క్యూబ్స్‌తో అందానికి మెరుగు..!
కిచెన్ గార్డెన్లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!
ప్రపంచంలోని 9 చిన్ని జంతువులు ఇవే..
ఇలా చేస్తే చాలు ఇంట్లో చీమలు దెబ్బకు కనిపించవ్..!!