బత్తాయి, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ ఫలాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. పరగడుపునే వీటిని తింటే గుండె మంట, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి.
పచ్చి మామిడి భారీగా ఫైబర్, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దానిని తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మొదలవుతాయి.
ఫ్రక్టోస్‌ను ఎక్కువగా కలిగి ఉండే పుచ్చకాయలను పరగడుపునే తినకూడదు. ఒకవేళ తింటే కడుపులో అసౌకర్యం, వికారం వంటి సమస్యలు మొదలవుతాయి.
అరటిపళ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. పరగడుపునే అరటిపళ్లు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు విపరీతంగా పెరుగుతాయి.
పైనాపిల్‌లో బ్రొమేలియన్ అనే ఎంజైమ్ ఉంటుంది. పరగడుపునే పైనాపిల్ తీసుకుంటే ఈ ఎంజైమ్ కారణంగా పొట్ట లైనింగ్ దెబ్బతింటుంది
బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైమ్ పొట్టలో అసౌకర్యానికి కారణమవుతుంది. పరగడుపునే బొప్పాయి తినకూడదు.
యాపిల్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. పరగడుపునే యాపిల్స్ తింటే గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు మొదలవుతాయి.
ద్రాక్షలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. పరగడుపునే ద్రాక్ష తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు విపరీతంగా పెరుగుతాయి.