a17f3299-53b4-483b-96c1-36db427cafd1-jpeg-optimizer_ors.jpg

పిల్లలకు ORS తాగించొద్దా.. నిపుణులు ఏమన్నారంటే

ఓఆర్ఎస్ ద్రావణం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది

జ్వరం, విరేచనాలు, వాంతులు వచ్చినప్పుడు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగాలని వైద్యులు సూచిస్తారు 

ఈ క్రమంలో పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వైద్యుల సలహా తీసుకోకుండానే ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందిస్తున్నారు

కానీ పిల్లలకు ఓఆర్ఎస్ ద్రావణం తాగించడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు

పిల్లలకు విరేచనాలు, డయేరియా, పొట్ట సంబంధిత సమస్యలు ఉన్నపుడు మాత్రమే ఓఆర్ఎస్ ఇవ్వాలంటున్నారు

పిల్లలకు ఓఆర్ఎస్ ఎక్కువగా ఇవ్వడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయంటున్నారు

తీవ్ర అలసట, వాంతులు వంటి సమస్యలను కూడా ఎదుర్కొవచ్చని తెలిపారు

ఇవి తాగిన పిల్లల్లో కొన్నిసార్లు శ్వాస సమస్యలు, కళ్ళల్లో వాపు లక్షణాలు కనిపిస్తాయన్నారు

అలాంటి పిల్లల్లో అధిక దాహం వేయడం, ఆకలి వేయకుండా ఉండటం వంటి సమస్యలుంటాయన్నారు

ఈ క్రమంలో ఓఆర్ఎస్ ద్రావణానికి బదులుగా కొబ్బరి, నిమ్మకాయ నీరు, పండ్ల రసాలు ఇవ్వాలని సూచిస్తున్నారు